వైవిధ్యమైన కథతో సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్ విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

విక్రమ్ప్రభు కథానాయకుడిగా సిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్ను శనివారం మేకర్స్ విడుదల చేశారు. రోమియో పిక్చర్స్ పతాకంపై రాహుల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తున్నారు. బంగారం వ్యాపారం వెనుక ఉండే తెరవెనుక రహస్యాలు మరియు సంచలన విషయాల నేపథ్యంలో విభిన్నమైన కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.