విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశానికి జగన్ను ఆహ్వానించిన సీపీఐ నేతలు

రిపోర్టర్: రమేష్ స్థలం: Tadepalli

రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులపై చర్చించేందుకు ఈనెల 26న విజయవాడలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకావాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీపీఐ నేతలు కోరినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను సీపీఐ బృందం కలిసి ఈ మేరకు ఆహ్వానం అందించింది. ప్రజా సమస్యలపై భవిష్యత్లోనూ వామపక్షాలు, వైసీపీ కలిసి పోరాటం చేసే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది.