భారత షూటర్ల పిస్టల్ గ్రిప్ సమస్యలను తీరుస్తున్న కోచ్ యూరీ లిసిచ్కో
రిపోర్టర్: అశోక్
స్థలం: Greater Noida
గ్రేటర్ నోయిడాలో యూరీ లిసిచ్కో నిర్వహిస్తున్న వర్క్‌షాప్ భారత షూటర్లకు కొండంత అండగా మారుతోంది. మను భాకర్, సరబ్జోత్ సింగ్ వంటి అగ్రశ్రేణి షూటర్లు పిస్టల్ గ్రిప్ సమస్యల పరిష్కారం కోసం ఆయనను ఆశ్రయిస్తున్నారు. 2009లో విదేశీ కోచ్‌గా భారత్‌కు వచ్చిన ఆయన, ప్రస్తుతం షూటర్ల అవసరాలకు తగినట్లుగా స్వయంగా చెక్కతో నూతన గ్రిప్స్‌ను తయారు చేస్తూ దేశ క్రీడా రంగానికి అమూల్యమైన సేవనందిస్తున్నారు.