మదీనాలో భారీగా యురేనియం, అరుదైన ఖనిజాలు గుర్తింపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

సౌదీ అరేబియాలోని మదీనా ప్రాంతంలో 110 మిలియన్ టన్నుల ముడి పదార్థాలను కనుగొన్నట్లు ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ వెల్లడించారు. జబల్ సయీద్ ప్రాజెక్టులో జరిపిన అన్వేషణలో అధిక సాంద్రతతో యురేనియం, అరుదైన భూ ఖనిజాలు లభించాయి. పారదర్శకతతోనే అణు కార్యక్రమాలను అభివృద్ధి చేస్తామని, రహస్య కార్యకలాపాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.