ఓటు చోరీని అరికట్టాలంటూ అచ్చంపేటలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ధర్నా
రిపోర్టర్: కిరణ్
స్థలం: అచ్చంపేట
దేశంలో ఓటు చోరీని అరికట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట పట్టణంలోని హాజీపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పెద్దఎత్తున ధర్నా నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీకి మద్దతుగా, ఈసీ ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ను అరెస్టు చేయాలని కోరుతూ ఈ నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆందోళనలో హాజీపూర్ చౌరస్తాలో కార్యకర్తలు ఓట్ చోర్, దేశ్ బచావో అంటూ నినాదాలు హోరెత్తించారు.