ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: విపక్ష నేతల అరెస్ట్ కలకలం
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
ఓటు చోరీ అంశం మరియు సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై నిరసనగా పార్లమెంట్ నుంచి నిర్వచన్ సదన్ వరకు విపక్ష ఎంపీలు భారీ పాదయాత్ర చేపట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. నీతి ఆయోగ్ ఆఫీస్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు నేతలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు వారిని అరెస్ట్ చేసి బస్సులో తరలించడంతో దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.