ఆటో కార్మికుల సంక్షేమానికి సర్కార్ పెద్దపీట: మంత్రులు పొన్నం, వివేక్
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
తెలంగాణలో ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ స్పష్టం చేశారు. సచివాలయంలో ఆటో సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రులు.. త్వరలోనే ఆటో ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఇందిరమ్మ బీమా లాంటి కీలక నిర్ణయాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.