తెలుగు సినిమా గర్వపడేలా రణాబాలి రానుంది: హీరో విజయ్ దేవరకొండ

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలుగు సినిమా గర్వపడేలా రణాబాలి చిత్రం రానుందని అగ్ర కథానాయకుడు దేవరకొండ విజయ్ వెల్లడించారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మరుగున పడ్డ చరిత్రను ఈ పీరియడ్ యాక్షన్ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం విజయదశమి కానుకగా ఈ నెల 16న విడుదల కానున్నట్లు తెలిపారు.