అమెరికాలో జూలై మాసం ఇండియన్ అమెరికన్ హెరిటేజ్ మంత్ గా గుర్తింపు

రిపోర్టర్: హరి స్థలం: అమెరికా

అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాల నేపథ్యంలో జూలై నెలను ఇండియన్ అమెరికన్ హెరిటేజ్ మంత్ గా గుర్తించాలని కోరుతూ భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో రెండువందల యాభై ఆరుగురు సభ్యుల మద్దతుతో తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల చారిత్రక సేవలను ఈ తీర్మానం ఘనంగా గుర్తిస్తుందని ఆయన తెలిపారు.