విశాఖలో విషాదం.. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గాజువాక

విశాఖ నౌసేనాబాగ్లోని గోమతి అపార్ట్మెంట్లో ప్రియాంక వర్మ అనే వివాహిత 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 3న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త దీపక్ వర్మ, అత్త రాణీ దేవిపై మల్కాపురం పోలీసులు వరకట్న మరణం కేసు నమోదు చేశారు. అదనపు కట్నం కోసం వేధించారని ఆరోపణలు రావడంతో, ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం చేశారు.