ఆక్స్ ఫర్డ్ యూనియన్ లో ప్రసంగంతో వైరల్ అయిన వీరాంశ్ భానుశాలి
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
ముంబైకి చెందిన ఆక్స్ ఫర్డ్ లా గ్రాడ్యుయేట్ వీరాంశ్ భానుశాలి ఆక్స్ ఫర్డ్ యూనియన్ లో భారత్ పాకిస్థాన్ విధానంపై చేసిన ప్రసంగంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. 26/11 ముంబై దాడి అనుభవాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రసంగం విశేష ఆకట్టుకుంది. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సులోనూ ఆయన యూత్ స్పీకర్ గా పాల్గొని భారతదేశం ఎదుగుదలపై ప్రసంగించారు.