బల్మూర్ వెంకట్ కేటీఆర్ కాళ్లు మొక్కి ప్రార్థించలేదా: దినేష్ చౌదరి
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. టికెట్ రాకముందు కేటీఆర్‌ను కలిసి పార్టీలో చేర్చుకోవాలని కాళ్లు మొక్కి ప్రాధేయపడలేదా అని ప్రశ్నించారు. ధైర్యం ఉంటే దీనిపై తల్లిదండ్రుల మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేస్తామంటే ఊరుకోమని, దాడి చేయడం తమకూ తెలుసని తీవ్రంగా హెచ్చరించారు.