ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కైవసం: చైర్పర్సన్గా షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక

రిపోర్టర్: సునీల్ స్థలం: నంద్యాల

నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం ముప్ఫై రెండు వార్డులు ఏకగ్రీవం కాగా, అందులో ఇరవై రెండు స్థానాలను టీడీపీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్పర్సన్గా షేక్ అనీషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఎన్నికతో స్థానిక పాలకవర్గ ఏర్పాటు సుగమమైందని వారు పేర్కొన్నారు.