ఘనంగా నటి సమంత సీమంత వేడుక
రిపోర్టర్: అశోక్
స్థలం: India
టాలీవుడ్ నటి సమంతకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా సీమంతం నిర్వహించారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్వహించిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. శ్రీవిద్య సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుక తనకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని, కాబోయే తల్లిని సృష్టికర్తగా గౌరవించే ఈ ఆచారం తనను ఎంతగానో కదిలించిందని సమంత తెలిపారు.