ఆసియా క్రీడల్లో వందకు పైగా పతకాలే లక్ష్యంగా భారత్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Japan

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో మరోసారి వందకు పైగా పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. గత హాంగ్‌జౌ క్రీడల్లో 107 పతకాలతో అద్భుత ప్రదర్శన చేసిన భారత్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యమే ధ్యేయంగా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. గాయం కారణంగా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ టోర్నీకి దూరమయినప్పటికీ, వివిధ విభాగాల్లో పతకాల సాధనే ధ్యేయంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా తెలిపారు.