సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రజల డిమాండ్
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 930పీ నేషనల్ హైవేపై సర్వీస్ రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలిగొండ, మోత్కూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో సర్వీస్ రోడ్లు లేక ప్రజలు ప్రాణాలకు తెగించి హైవే దాటుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భద్రతా చర్యలు కరువవ్వడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.