క్రీడా సంఘాల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని క్రీడా సంఘాల్లో పారదర్శకత పెంచడంతోపాటు పరిపాలనా వ్యవస్థను సమూలంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ తరహాలోనే రాష్ట్రంలోనూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు అధికారులు ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తున్నారు.