'నమ్మకం, పారదర్శకతే మా ప్రధాన సూత్రాలు': రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్
రిపోర్టర్: హరి
స్థలం: కెనడా
కెనడాలో జరుగుతున్న 51వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన భారత్ పర్వ్ కార్యక్రమంలో రామోజీ గ్రూప్ సీఎండీ సీహెచ్. కిరణ్ ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచస్థాయి సినీ నిర్మాణ సేవలు అందించడంలో నమ్మకం, పారదర్శకత, పనితీరు సామర్థ్యమే తమ ప్రధాన సూత్రాలని ఆయన స్పష్టం చేశారు. భారత్లో సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల సేవలు రామోజీ ఫిల్మ్ సిటీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్. విజయేశ్వరి, కె. బాపినీడు చౌదరి తదితరులు పాల్గొని భారతీయ వినోద రంగంలోని అవకాశాలపై చర్చించారు.