పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తత్సవటపల్లి సత్యనారాయణమూర్తి కన్నుమూత
రిపోర్టర్: అశోక్
స్థలం: పాలకొల్లు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు డాక్టర్ తత్సవటపల్లి సత్యనారాయణమూర్తి ఎలియాస్ బాబ్జి అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1972 నుంచి వైద్యసేవలందించిన ఆయన, 2004లో తెదేపా తరఫున పాలకొల్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.