జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని బీఎల్ఎఫ్ డిమాండ్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జనగణనలో బీసీ కాలమ్ను చేర్చాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మూడు డిక్లరేషన్లను తక్షణమే అమలు చేయాలని బెల్లంపల్లిలో జరిగిన సమావేశంలో బీఎల్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నవంబర్ మొదటి తేదీన మంచిర్యాలలో నిర్వహించనున్న రౌండ్టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని తమ గళం వినిపించాలని కోరారు.