పిఠాపురంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులని జనసేన పార్టీ వెల్లడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: పిఠాపురం
పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల ఆశలకు అనుగుణంగా భారీ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. రూ.200 కోట్లతో రహదారులు, రూ.470 కోట్లతో తాగునీటి పనులు, రూ.225 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. అలాగే రూ.323 కోట్లతో ఉప్పాడ రక్షణ గోడ నిర్మాణం, రూ.86 కోట్లతో ఆసుపత్రులు మరియు ఆరోగ్య రంగ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి ఇస్తున్నామని పేర్కొంది.