కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: కర్ణాటక
కర్ణాటకలోని కేజీఎఫ్ సమీపంలో తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.