కూకట్పల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ భవనం కూల్చివేత

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని హబీబ్ నగర్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఒక అక్రమ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నేలమట్టం చేశాయి. నగరంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని కాపాడేందుకు, భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు కూల్చివేత పనులను పర్యవేక్షించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇటువంటి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.