అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి భూ కేటాయింపులు చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం పన్నెండు ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన ఆ పార్టీ, అమరావతి ప్రాంతంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ అత్యాధునిక వైద్య సేవలు స్థానిక ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది.