అరుదైన రికార్డు: సుధా మూర్తి పుస్తకం చదివి అబ్బురపరిచిన బాలుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: Bengaluru
బెంగళూరుకు చెందిన నాలుగేళ్ల బాలుడు అథర్వ కీర్తి సాగర్ సుధా మూర్తి రాసిన కథల పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని కేవలం ఇరవై ఆరు నిమిషాల్ లో చదివి అరుదైన రికార్డు సృష్టించాడని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు తెలిపారు. నాలుగు సంవత్సరాల పదకొండు నెలల వయసున్న అథర్వ ఒకే చాప్టర్ లోని వెయ్యి ఆరు వందల డెబ్బై ఆరు ఆంగ్ల పదాలను అనర్గళంగా చదివి ఈ ఘనత సాధించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.