నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషి సురేందర్ కోలీ ఆత్మహత్య
రిపోర్టర్: వెంకట్
స్థలం: హరిద్వార్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషిగా విడుదలైన సురేందర్ కోలీ హరిద్వార్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. నొయిడాలోని మోనిందర్‌సింగ్ పంఢేర్ ఇంట్లో సహాయకుడిగా పనిచేసిన కోలీ, నిఠారీ హత్యల కేసులో అరెస్టై తర్వాత అలహాబాద్ హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటపడ్డాడు. తాజాగా హరిద్వార్‌లోని ఒక టీస్టాల్‌లో ఉరివేసుకుని మృతి చెందడం కలకలం రేపింది.