స్థానిక ఎన్నికల వేళ విశాఖలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్: పటిష్ట భద్రతా చర్యలు
రిపోర్టర్: రాము
స్థలం: విశాఖపట్నం
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన ముందస్తు చర్యలు చేపడుతోందని VizagCityPolice వెల్లడించారు. నగర పోలీసు కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగరంలో ప్రత్యేకంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని, ప్రజలు ఎలాంటి భయానికి గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.