పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు: త్వరలో ఆరవ తరగతి సిలబస్ లో ఏఐ

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

రాష్ట్రంలోని విద్యార్థులకు కృత్రిమ మేధ నైపుణ్యాలు అందించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి యాభై లక్షల మంది నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఆరవ తరగతి నుంచి డిగ్రీ వరకు సిలబస్ లో ఏఐ అంశాలను చేర్చనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రాథమిక భావనలు నేర్పి, ప్రాక్టికల్ అభసన విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ముందుగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.