చెరువుల పరిరక్షణకు రంగంలోకి హైడ్రా: మెళ్లచెరువు వద్ద ఫెన్సింగ్ పనులు షురూ

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

మెళ్లచెరువు పరిరక్షణ కోసం హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులను అధికారికంగా ప్రారంభించారు. తెల్లాపూర్ కాలనీ సంఘం విజ్ఞప్తి మేరకు ఈ కీలక చర్య చేపట్టారు. చెరువుల కబ్జాలు అలాగే అక్రమ డంపింగ్ను అరికట్టడానికి ఈ ఫెన్సింగ్ రక్షణగా నిలవనుంది. స్థానిక ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరడంతో కాలనీవాసులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.