డల్లాస్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం: గ్రాడా కమిటీ ఆహ్వానం
రిపోర్టర్: సురేష్
స్థలం: Dallas
అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రాడా నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ ముప్పై ఒకటిన ఫ్రిస్కోలోని ఇండెపెండెన్స్ హైస్కూల్లో ఈ దివ్య కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి క్షేత్ర అర్చకుల పర్యవేక్షణలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లోక కల్యాణం కోసం భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.