నోటీసులు అందుకున్న ప్రజలు వెంటనే ధ్రువపత్రాలు సమర్పించాలి.. అధికారుల కీలక సూచన
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా హియరింగ్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. స్థానిక అగర్వాల్ భవన్లో పలు వార్డులకు సంబంధించిన హియరింగ్ కార్యక్రమం నిర్వహించగా, నోటీసులు అందిన ప్రజల నుంచి బీఎల్ఓ అనురాధ దరఖాస్తులు స్వీకరించారు. నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరూ సంబంధిత ధ్రువపత్రాలను వెంట తెచ్చి దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయూ నాయకులు పసులేటి వెంకటేష్, బస్తీ వాసులు కనకరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.