ఘనంగా ఒంగోలు పట్టణ వందేళ్ల ఉత్సవాలు మరియు ఆవిర్భావ వేడుకలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఒంగోలు
ఒంగోలు పట్టణం ఆవిర్భవించి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక మినీ స్టేడియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఒంగోలుతో తనకు గొప్ప అనుబంధం ఉందని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైందని ఆయన వెల్లడించారు. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.