ఓటర్ల జాబితా సవరణ గడువు పెంపు: నవంబర్ ముప్పైకి తుది జాబితా ప్రకటన
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ గడువును మరోసారి పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ జారీ చేసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో నవంబరు ఇరవై వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఆయన వివరించారు. నవంబరు ముప్పైకి తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.