ఖమ్మం జిల్లాలో గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేసిన కలెక్టర్
రిపోర్టర్: Narendra kumar kinnera
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం జిల్లావ్యాప్తంగా గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. పోలీస్ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. 18 రెగ్యులర్, 2 రొటేటింగ్ క్రేన్లు, 150 మంది గజ ఈతగాళ్లు, రక్షణ పడవలు, లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.