బెంగళూరు మెట్రోలో మహిళపై రహస్యంగా వీడియో రికార్డింగ్: కలకలం సృష్టించిన ఘటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Bengaluru

బెంగళూరు మెట్రో రైలులో ప్రయాణిస్తున్న సౌపిక అనే మహిళను మరో ప్రయాణికుడు రహస్యంగా వీడియో రికార్డింగ్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. నిందితుడిని నిలదీసి ప్రశ్నించినట్లు బాధితురాలు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెంగళూరు నగర పోలీసులు గురువారం అధికారికంగా వెల్లడించారు.