వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధం, మార్కెట్లలో జోరుగా కొనుగోళ్లు

రిపోర్టర్: శివ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకల సందడి నెలకొంది. మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ఎస్పీలతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.