విశాఖలో హెచ్పీసీఎల్ అగ్నిప్రమాదం: స్పష్టతనిచ్చిన నగర పోలీసులు
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం హెచ్పీసీఎల్ రిఫైనరీలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై విశాఖ నగర పోలీసులు తాజాగా అధికారికంగా వివరణ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని నగర పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాదానికి తక్షణ కారణాలపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. స్థానికులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.