జగిత్యాల వైద్య కళాశాలలో విద్యార్థుల ఆందోళన: మౌలిక వసతుల కోసం శాంతియుత నిరసన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: జగిత్యాల
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు మౌలిక వసతుల కొరతపై అనిశ్చిత కాలానికి శాంతియుత ఆందోళనను ప్రారంభించినట్లు విద్యార్థులు తెలిపారు. భవన నిర్మాణాలు పూర్తి కాలేదని, ప్రయోగశాలలు, వసతి గృహాలు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఐదు బ్యాచ్‌ల విద్యార్థులకు కేవలం మూడు లెక్చర్ హాల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ పోస్టింగ్‌ల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.