ఫిట్నెస్ సంచలనం: అదనంగా ఎనభై కేజీల బరువుతో ప్లాంక్ రికార్డు సృష్టించిన యువతి
రిపోర్టర్: సునీల్
స్థలం: సూరత్
గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఇరవై మూడేళ్ల యువతి పటేల్ పూజా స్మిత్ కుమార్ అసాధారణ ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నట్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు వెల్లడించారు. తన వీపుపై ఎనభై కేజీల బరువును ఉంచుకుని రెండు నిమిషాల ఆరు సెకన్ల పాటు ప్లాంక్ భంగిమను నిలకడగా కొనసాగించి సరికొత్త రికార్డును నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు.