ఇండియా పోస్ట్ జీడీఎస్ రిజిస్ట్రేషన్ గడువు ముగింపు
రిపోర్టర్: సతీష్
స్థలం: India
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 యూజర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23,757 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను సమర్పించి ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు.