తల్లిదండ్రుల మందలింపుతో అదృశ్యమైన యువకుడిని కాపాడిన విశాఖ పోలీసులు
రిపోర్టర్: గోపి
స్థలం: గోపాలపట్నం
తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోయిన యువకుడిని విశాఖ నగర పోలీసులు రెండు గంటల వ్యవధిలో క్షేమంగా గుర్తించారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు యువకుడి ఆచూకీ కనిపెట్టారు. సురక్షితంగా యువకుడిని తల్లికి అప్పగించిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు.