చిరంజీవి ఇంట్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిరంజీవి కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. రామ్ చరణ్, చిరంజీవి తమ కూతురు క్లిన్ కారాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం మెగా కుటుంబానికి సంబంధించిన ఈ పూజా కార్యక్రమం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.