ఇంద్రపాలనగర చారిత్రక కట్టడాలను సందర్శించిన డిగ్రీ విద్యార్థులు

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

యాదాద్రి జిల్లా రామన్నపేట మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాల యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రాచీన సామ్రాజ్య రాజధాని ఇంద్రపాల నగరమును సందర్శించారు. విష్ణుకుండినుల కాలం నాటి చారిత్రక కట్టడాలను పరిశీలించి అప్పటి వైభవాన్ని నెమరు వేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధ్యాపకులు కోరారు.