రోడ్డు ప్రమాదం నుంచి కోలుకోవడంపై సాయి ధరమ్ తేజ్ భావోద్వేగం

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

హైదరాబాద్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తాను కోలుకున్న వైనాన్ని గుర్తుచేసుకుంటూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు. ఆ ప్రమాదం తనకు రెండో జన్మలాంటిదని, ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు సహాయపడిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనను కాపాడిన సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్‌కు ఇప్పటికే ఆర్థిక సహాయం అందించినట్లు తేజ్ స్పష్టం చేశారు.