స్థానిక ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయండి.. పాడేరులో పార్టీ పిలుపు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పాడేరు

పాడేరులో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరిగింది. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో స్థానానికి ఒకే అభ్యర్థిని ఖరారు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రజల్లో ఉన్న నాయకులను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని నాయకులు స్పష్టం చేశారు. కార్యకర్తలందరూ ఐక్యంగా ఉంటూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.