భారత వైద్య విధానంపై యూరప్ డాక్టర్ల విస్మయం: అదెలా సాధ్యమంటూ ఆశ్చర్యం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

భారత వైద్య వ్యవస్థలో క్యాన్సర్ చికిత్స వేగంగా అందుబాటులోకి రావడంపై యూరప్ దేశాల వైద్యులు తీవ్ర విస్మయం వ్యక్తం చేశారని ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలక్ భట్ వెల్లడించారు. యూరప్లో సాధారణ వైద్యుడిని కలవడానికే రోజుల తరబడి సమయం పడుతుందని, కానీ భారతదేశంలో రోగులు నేరుగా నిపుణులను సంప్రదించి కేవలం ఒక వారం రోజుల్లోనే వైద్య చికిత్సను ప్రారంభించడం చూసి అక్కడి వైద్యులు ఆశ్చర్యపోయారని ఆయన తాజాగా తెలిపారు.