ముంబైలో మెట్రో బారికేడ్ కూలి ప్లంబర్ మృతి

రిపోర్టర్: గోపి స్థలం: ముంబై

ముంబైలోని విఖ్రోలి ఎల్బీఎస్ రోడ్డులో మెట్రో నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్ అదుపుతప్పి కదులుతున్న ద్విచక్ర వాహనంపై పడటంతో వాసి హైదర్ ఇస్మాయిల్ అనే 54 ఏళ్ల ప్లంబర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘట్కోపర్‌కు చెందిన మృతుడు ములుంద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మృతుని కుమారుడు ఫిర్యాదు చేయడంతో పార్క్‌సైట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.