స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు నేడు కీలక భేటీ

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి కూటమి నేతలు సన్నద్ధమవుతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇవాళ సమావేశం కానున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.