కాలే ఇస్తారి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కాలే ఇస్తారి దశదిన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై ఇస్తారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాచకొండ రమేష్ బాబు, గునిగంటి రాజు గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఉప్పల నాగరాజు, పల్లె మారయ్య, వంజరి రాములు, చెదురుపల్లి అబ్బయ్య, ఏనుగు మోహన్ తదితరులు పాల్గొన్నారు.