ఉద్యోగులకు తీపి కబురు: ఉచిత తాత్కాలిక వసతి గడువు మరో ఏడాది పొడిగింపు
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత తాత్కాలిక నివాస వసతి గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మరియు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన లేఖను పరిశీలించిన ప్రభుత్వం, 2026 జూన్ 27 నుంచి ఏడాది పాటు లేదా సీఆర్డీఏ నివాస గృహాలు కేటాయించే వరకు ఈ సదుపాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది.